మూవీడెస్క్: లైగర్ దెబ్బ, డబుల్ ఇస్మార్ట్ పై ప్రభావం? విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా విడుదల తర్వాత ఎలాంటి రిజల్ట్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టాలను తెచ్చింది. లైగర్ థియేట్రికల్ రైట్స్‌ను కొనుగోలు చేసిన వరంగల్ శ్రీను, ఈ నష్టానికి పూరి జగన్నాథ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి వారు వరుసగా ప్రొడ్యూసర్ కౌన్సిల్‌ని ఆశ్రయించి, రోడ్డుపై నిరాహార దీక్షకు దిగారు.
ఇక ఇప్పుడు పూరి డైరెక్ చేసిన “డబుల్ ఇస్మార్ట్” సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, లైగర్ కారణంగా నష్టపోయిన ఎగ్జిబిటర్స్, ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు.
ఇక గొడవను పరిష్కరించడానికి ఏషియన్ సునీల్ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. పూరి జగన్నాథ్, తన తదుపరి సినిమా ద్వారా లైగర్ నష్టాన్ని భరించి, సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నట్లు టాక్ వస్తోంది.
దాదాపు గొడవ ముగిసినట్లే అని సమాచారం. ఇక “డబుల్ ఇస్మార్ట్” ప్రమోషన్స్ మరింత ఉత్సాహంగా సాగే అవకాశం ఉంది.
మరి ఈ సినిమాతో అయినా పూరి బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్లు అందుకుంటాడో లేదో చూడాలి.