టాంజేనియా: ఈ సంవత్సరానికి టాంజేనియా నవలా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నాకు సాహిత్యంలో నోబెల్ బహుమతి వచ్చింది. అబ్దుల్ రజాక్ వలసవాదంపై రాజీలేని పోరాటం చేయడంతో పాటు, శరణార్థుల బాధలను కళ్లకు కట్టినట్టు చూపించడం జరిగింది.
ఆందు వల్ల ఆయనకు ఈ అత్యంత విలువైన పురస్కారాన్ని అందజేయనున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఇవాళ ప్రకటించింది. ఈ మేరకు తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేసింది. శ్రీ గుర్నా 1948లో హిందూ మహాసముద్రంలోని జాంజిబర్ అనే ద్వీపంలో జన్మించారు. అయితే 1960వ సంవత్సరం చివర్లో ఆయన శరణార్థిగా ఇంగ్లాండ్ కి వలస వెళ్ళిపోయారు.
కాగా ఇప్పుడు అబ్దుల్ గుర్నా కేంట్రబెరీలోని కెంట్ యూనివర్శిటీలో సాహిత్య విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన తన 21 ఏళ్ళ వయసు నుండే రచనలు రాయడం ప్రారంభించారు. ఆయన ఇప్పటి వరకు 10 నవలలు, ఎన్నో చిన్న చిన్న కథలు కూడా రచించారు. 2005లో రజాక్ రాసిన ‘డిసర్షన్’ నవల అప్పట్లో సంచలనం సృష్టించింది.