లక్నో: 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రముఖ బిజెపి నాయకుడు ఎల్కె అద్వానీ తన వాంగ్మూలాన్ని ప్రత్యేక సిబిఐ కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నమోదు చేశారు. అయోధ్యలోని బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన కేసులో నిందితుల్లో ఒకరైన్ 92 ఏళ్ల అద్వానీ వీడియో లింక్ ద్వారా లక్నోలోని ప్రత్యేక సిబిఐ కోర్టుకు హాజరయ్యారు.
ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు దాదాపు 4.30 గంటల పాటు జరిగిన విచారణలో, 100 కి పైగా ప్రశ్నలు అద్వానీని జడ్జి గారు అడిగారు. ఆయనపై ఉన్న అన్ని ఆరోపణలను ఆయన ఖండించారు అని అతని న్యాయవాది చెప్పారు. బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మిస్టర్ అద్వానీని కలిశారు. ఇరువురు నాయకులు సుమారు 30 నిమిషాలు మాట్లాడారు.
కోర్టు, రోజువారీ విచారణల ద్వారా, విచారణను పూర్తి చేసి, ఆగస్టు 31 లోగా తన తీర్పును ఇవ్వాలి. అయితే ఆగష్టు 5న అయోధ్య రామ మందిర నిర్మాణ ప్రారంభానికి ముంది ఇది ఒక సంచలన తీర్పు అయ్యే అవకాశం ఉంది.
చాలా సంవత్సరాల వివాదం తరువాత అయోధ్య సమస్య తీరి రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమయింది. ఈ బృహత్తర కార్యక్రమానికి అద్వానీని కూడా ముఖ్య అతిథిగా పిలిచే అవకాశాలు ఉన్నాయి.