విశాఖపట్నం: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమికి బలమైన పోటీ ఇవ్వగల సామర్థ్యం ఉన్న నాయకుడిగా వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు.
శుక్రవారం తన క్యాంప్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు. మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ సభ్యులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ప్రస్తుతం స్థానిక సమ్ష్తల్లో ఎక్కువ మంది సభ్యులు వైఎస్ఆర్‌సీపీకి చెందినవారు ఉన్నారు. అందువల్ల, సభ్యులందరూ తమ పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తే, బొత్స సత్యనారాయణ గెలిచే అవకాశం ఉంది.
కానీ ప్రభుత్వం మారిపోయిన నేపధ్యంలో, ఎంత మంది సభ్యులు వైఎస్ఆర్‌సీపీకి కట్టుబడి ఉంటారో అనేది వేచి చూడాల్సిన అంసం. కాగా, ఇక్కడ బొత్స ఫాక్టర్ కీలకంగా మారనుంది.
బొత్స సత్యనారాయణ శక్తివంతమైన నాయకుడు, ఆయన రాజకీయ మరియు ఆర్థిక స్థాయి ఉన్న వ్యక్తిగా పరిగణించబడతారు. ఈ నేపథ్యంలో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణపై నమ్మకం పెట్టుకున్నారు.