fbpx
Thursday, November 28, 2024
HomeTelanganaఉస్మానియా ఆసుపత్రి పాత భవనం మూసివేత

ఉస్మానియా ఆసుపత్రి పాత భవనం మూసివేత

LOCK-OSMANIA-HOSPITAL-OLD-BLOCK

హైదరాబాద్‌ : హైదరాబాద్ నగరానికే తలమానికమైన, పాతదైన ఉస్మానియా ఆసుపత్రి ఎందరికో వైద్యం అందించి ప్రాణం పోసింది. ఇక్కద ఎంతో మంది వైద్య సదుపాయాలు పొంది సంపూర్ణ ఆరోగ్యం తో వెళ్ళారు.

అయితే ఆ ఆసుపత్రి భవనాలు ఇప్పుడు శిథిలావస్త లో ఉన్నాయి. ఈ మధ్య కురిసిన వర్షాల ధాటికి ఈ ఆసుపత్రి భవనాల లో గదులన్నీ నీళ్ళతో నిండి, రోగులు మరియు వైద్యులు చాలా ఇబ్బంది పడ్డారు.

దీంతో మూడు రోజులుగా ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించాలని వైద్యులు, సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో పాత భవనాన్ని సీల్‌‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో పాత భవనాన్ని వెంటనే ఖాళీ చేయాలని డీఎంఈ రమేష్‌రెడ్డి ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన పాత భవనానికి తాళం వేసి సీల్‌ వేయాలన్నారు. ఈ పాత బ్లాక్‌లో ఉన్న అన్ని డిపార్ట్‌మెంట్లను వేరేచోటకి మార్చాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాత భవనంలోని పేషెంట్లను పక్క భవనంలోకి తరలించే కార్యక్రమం మొదలు పెట్టనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular