ఆగ్రా: 17వ శతాబ్దపు దిగ్గజ ప్రేమ స్మారక చిహ్నం అయిన తాజ్ మహల్ కు, లొక్డౌన్ కారణంగా డెబ్బై రోజుల విరామం లభించింది. తాత్కాలికంగా ఉపశమనం పొందటానికి మరియు కట్టడం యొక్క చరిత్రలో మొదటిసారిగా మంచి వైభవాన్ని పునరుద్ధరించడానికి లొక్డౌన్ సహాయ పడింది. మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణాన, 10,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పర్యావరణ సున్నితమైన తాజ్ ట్రాపెజియం జోన్‌లో పర్యావరణ పరిస్థితుల్లో ఎటువంటి ప్రాథమిక మార్పులు జరగలేదని స్థానిక కార్యకర్తలు అంటున్నారు.
వాయు కాలుష్య స్థాయి మానవులను మరియు రాళ్లను ప్రభావితం చేస్తుంది. ఎట్మౌడౌలా వ్యూ పాయింట్ పార్కులో శుక్రవారం తెల్లవారుజామున నదుల అనుసంధాన ప్రచార కార్యక్రమం లో యమునా నదిని కాపాడటానికి అత్యవసర చర్యలు తీసుకోవాలని, ఆగ్రా లోని పారిశ్రామిక సమూహాల ద్వారా కాలుష్య కారకాలు విడుదల అవుతున్నాయని పర్యావరణ ప్రేమికులు వారి అభిప్రాయాలును వెల్లడించారు.
పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది మరియు స్థానిక జనాభా ఆరోగ్యం ప్రమాదంలో ఉందని కార్యకర్త జుగల్ కిషోర్ అన్నారు. గతంలో, సుప్రీం కోర్టు నుండి వరుస ఉత్తర్వులు వచ్చాయి, కానీ డెయిరీలు, ధోబీ ఘాట్లు, దహన ప్రదేశాలు, పెతా యూనిట్ల , షిఫ్టింగ్ ఆర్డర్లు నిలిపివేయబడ్డాయి. యమునా కినారా రోడ్‌లో కాలుష్య కారకాలను విడుదల చేసే రవాణా సంస్థలను కూడా మార్చలేదు. ఎండిపోయిన మరియు కలుషితమైన యమునా నది, తాజ్ మహల్ భద్రతకు నిరంతర ముప్పుగా మిగిలిపోయిందని బ్రజ్ మండల్ హెరిటేజ్ కన్జర్వేషన్ సొసైటీ కార్యకర్తలు అంటున్నారు. యమున ఒడ్డున ఉన్న చారిత్రక కట్టడాల యొక్క మంచి పటిష్టతకు యమునాలో నీరు అవసరం, ఎందుకంటే పునాదులకు నిరంతర తేమ మరియు కాలుష్య రహిత వాతావరణం ఉండాలి అని సొసైటీ అధ్యక్షుడు సురేంద్ర శర్మ అన్నారు.
ఢిల్లీ మరియు ఆగ్రా మధ్య పర్యాటకుల కోసం ఫెర్రీ సర్వీసును ప్రారంభిస్తామని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కిరి ఇచ్చిన హామీని సొసైటీ ఇటీవల ఒక లేఖలో గుర్తు చేసింది. ఆగ్రా కాలేజీ మైదానంలో తన ఎన్నికల ప్రచార ప్రసంగంలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల తరువాత యమునా శుభ్రపరచడం అధిక ప్రాధాన్యత గా తీసుకుంటాం అని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా యమునాను రక్షించే చర్యల గురించి మాట్లాడారు. ఢిల్లీ మరియు ఆగ్రా మధ్య యమునాను శుభ్రపరచడానికి ప్రభుత్వ సంస్థలు చేసిన వివిధ ఖర్చులపై శ్వేతపత్రం విధుల చెయ్యాలని సమావేశం పిలుపునిచ్చింది.