బెంగళూరు: నేడు, ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్యపై కేసు నమోదయింది.
సిద్ధరామయ్య పై లోకాయుక్త ఒక కేసును నమోదు చేసింది. ముడా (మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) కు సంబంధించి భూముల వ్యవహారంలో ఆయన తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
కాగా ఈ నేపథ్యంలో, లోకాయుక్త ఆధ్వర్యంలో దర్యాఫ్తునకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇవ్వడం జరిగింది.
దీనితో సిద్ధరామయ్యను ఎఫ్ఐఆర్‌లో ఏ1గా చేర్చారు. కాగా, నిందితుల జాబితాలో ముఖ్యమంత్రి తో పాటు ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జున్ తదితరుల పేర్లను కూడా నమోదు చేశారు.
అయితే, ముడా స్థలాల కేటాయింపులో సీఎం సిద్ధరామయ్య మరియు ఆయన కుటుంబ సభ్యులు భారీగా లబ్ధి పొందారని, దీనికోసం ఆయన తన అధికారాన్ని కూడా దుర్వినియోగం చేశారని సామాజిక కార్యకర్త ఇబ్రహీం కర్ణాటక గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
అందువల్ల ఈ స్కాంకు సంబంధించి దర్యాఫ్తులో భాగంగా సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు.
ఇదిలా ఉండగా, తనపై గవర్నర్ అనుమతి ఇవ్వడంపై సిద్ధరామయ్య హైకోర్టు మెట్లు కూడా ఎక్కారు. అయితే, హైకోర్టులో కూడా సిద్ధరామయ్య కు చుక్కెదురైంది.