టాలీవుడ్: ఓటీటీ లకి మంచి ఆదరణ దక్కుతుండడం తో ఎప్పటి నుండో ఉన్న జీ, హాట్ స్టార్ ఓటీటీ లు కూడా కేవలం హిందీలోనే కాకుండా రీజనల్ భాషల్లోనే సిరీస్ లు తీయడం ప్రారంభించాయి. ఈ మధ్యనే zee5 వారు రూమ్ నం: 54 అనే తెలుగు వెబ్ సిరీస్ ని రూపొందించి విడుదల చేసారు. ఇపుడు ‘LOL సలాం’ అనే మరో వెబ్ సిరీస్ ని రూపొందించి విడుదల చేయబోతున్నారు. ఈ రోజు ఈ సిరీస్ కి సంబందించిన ట్రైలర్ విడుదలైంది.
కరోనా టైం లో ఇంట్లోనే ఉండి పని చేస్తూ విసుగు చెందిన కొందరు ఫ్రెండ్ అలా చిల్ అవుట్ అవుదామని కార్ వేసుకుని ఔటింగ్ అని బయలుదేరుతారు. అలా అడవిలోకి వెళ్లిన ఫ్రెండ్స్ తెలియకుండా నక్సల్స్ ఉండే ఏరియా లోకి అడుగుపెడతారు. అక్కడ నడుస్తూ ఉన్న ఒక ఫ్రెండ్ ల్యాండ్ మైన్ పైన కాలు పెడతాడు. అక్కడి నుండి కథ ఎలా మలుపు తిరుగుతుంది అని పూర్తి ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్ తో ఈ సిరీస్ ని రూపొందించారు. నక్సల్స్ ఎలిమెంట్స్ కి కామెడీ ని జోడించినట్టు లాల్ సలాం లో ‘LOL ‘ ని చాట్ భాషలో వాడే పెద్ద నవ్వు అనే పదం తో రీప్లేస్ చేసి క్రియేటివిటీ చూపించారు.
ట్రైలర్ వరకు ఎంటర్టైనింగ్ గా ఆకట్టుకుంది. సంభాషణలు కూడా రియాలిటీ కి దగ్గరగా ఉన్నాయి. దాదాపు అందరూ కొత్త వాళ్ళు లేదా తక్కువ సినిమాల్లో కనిపించిన ఆర్టిస్ట్స్ ఈ సిరీస్ లో నటించారు. సీనియర్ రైటర్ , డైరెక్టర్ ఒక పాత్రలో కనిపించాడు. కొత్త దర్శకుడు నాని ఈ సిరీస్ ని డైరెక్ట్ చేసాడు. జూన్ 25 న ఈ ‘LOL సలాం’ సిరీస్ జీ 5 లో స్ట్రీమ్ అవనుంది.