
టాలీవుడ్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో నాగ చైతన్య హీరో గా రూపొందిన ‘లవ్ స్టోరీ’ సినిమా ఒకటి. ఈ సినిమా నుండి విడుదలైన ప్రతి ప్రమోషనల్ ఎలిమెంట్ టీజర్ కానీ, పోస్టర్స్ కానీ ఈ సినిమా పైన అంచనాలని పెంచాయి. అంతే కాకుండా నాగ చైతన్య కెరీర్ లో మరో పెద్ద హిట్ అవడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రియలిస్టిక్ ఎలిమెంట్స్ తో సినిమాని రూపొందించే డైరెక్టర్ మరియు టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ఇందులో హీరోయిన్ గా నటించడం ఈ సినిమాకి మరో ప్లస్. ఇలా అన్ని అడ్వాంటేజెస్ తో ఈ సినిమా రూపొందింది.
2020 సంవత్సరం ఏప్రిల్ లోనే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వలన ఇన్ని రోజులు ఆలస్యం అయింది. ఈ రోజు ఈ సినిమా విడుదలకి సంబందించిన అప్ డేట్ విడుదల చేసారు మేకర్స్. ఇపుడిపుడే చిన్న సినిమాలు అన్నీ విడుదల తేదీలు ప్రకటించేస్తున్నాయి. థియేటర్లలో సినిమాలు కూడా కొంతవరకు బాగానే ఆడుతున్నాయి. ఇప్పటివరకు విడుదల తేదీ ప్రకటించిన సినిమాల్లో కొంచెం గుర్తింపు ఉండి జనాలని థియేటర్లకు రప్పించగలిగే సినిమా ఏదీ అంటే ‘లవ్ స్టోరీ’ అనే చెప్పొచ్చు. ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధిస్తే మరిన్ని పెద్ద సినిమాలు కూడా విడుదలకి సిద్ధం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాని సెప్టెంబర్ 10 న విడుదల చేయనున్నారు.