మూవీడెస్క్: దుల్కర్ సల్మాన్ హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లక్కీ భాస్కర్ మూవీ అక్టోబర్ 31న ఐదు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత నాగవంశీ ప్రత్యేకంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ సినిమా విషయంలో తాను ఎంతగానో కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు వెల్లడించారు.
“లక్కీ భాస్కర్‌లో ఎటువంటి చిన్న తప్పులూ లేవు. ఎవరైనా తప్పులు చూపిస్తే వారికి పెద్ద పార్టీ ఇస్తా,” అంటూ ఛాలెంజ్ చేశారు.
ఇదే తరహా వ్యాఖ్యలు నాగవంశీ గతంలో ‘మ్యాడ్’ మూవీపై కూడా చేశారు.
ఆ సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో ఆయన ఛాలెంజ్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది.
ఇప్పుడు అదే సాహసం ‘లక్కీ భాస్కర్’పైనా చేయడం విశేషం.
‘సీతారామం’ తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో చేస్తున్న ఈ సినిమా పైన భారీ అంచనాలున్నాయి.
అలాగే ‘సార్’తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి ఈ సారి బ్యాంకింగ్ సెక్టార్ నేపథ్యంతో మనీ గోల్ మాల్ డ్రామా తెరపైకి తీసుకురాబోతున్నాడు.
ఈ సారి ఆయన ప్రణాళిక ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.