ఢిల్లీ: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్ అయిన క్రిస్ లిన్ తమకు రేపు వారంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మంగళవారం న్యూకార్పోరేషన్ మీడియాకు స్వయంగా తెలిపిన లిన్, క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు తమ కోసం చార్టర్ ప్లేన్ వేయమని విజ్ఞప్తి చేసినట్లు కూడా తెలిపాడు.
తాము ఈ ఐపీఎల్ టోర్నీ ముగిసిన తర్వాత క్షేమంగా స్వదేశానికి వచ్చేందుకు చార్టర్ విమానాన్ని వేయమని కోరాడు. ‘సీఏకు టెక్స్ట్ మెసేజ్ చేశాను. ప్రతీ ఐపీఎల్ టోర్నమెంట్ ద్వారా సీఏ 10 శాతం డబ్బును సంపాదిస్తుంది. ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియ తద్వారా వచ్చిన డబ్బును మాకు చార్టర్ విమానం వేయడానికి ఖర్చు చేస్తుందనే భావిస్తున్నాను అని అన్నారు.
ప్రజలు మా కంటే కూడా అధిక ఇబ్బందులు పడుతున్నారు. మేము కూడా కఠినమైన బయోబబుల్‌లోనే ఉంటున్నాము. వచ్చే వారం తాము వ్యాక్సిన్ కూడా వేయించుకుంటాము. దాంతో మమ్మల్ని టోర్నీ ముగిసిన తర్వాత చార్టర్ విమానం ద్వారా ఇంటికి చేరుస్తారని ఆశిస్తున్నాము, మేము షార్ట్ కట్‌లు గురించి అడగడం లేదు అని లిన్ అన్నారు.
సంతకాలు చేసేటప్పుడే మేము రిస్క్ గురించి తెలుసుకునే చేశాం. ఈ టోర్నీ పూర్తయి ఎంత తొందరగా ఇంటికి క్షేమంగా చేరుకుంటే అంత మంచిది అని తెలిపాడు. ఇదిలా ఉంచితే, ఆస్ట్రేలియా క్రికెటర్, కేకేఆర్ సభ్యుడు ప్యాట్ కమిన్స్, భారత పీఎం కేర్స్‌కు 50వేల యూఎస్ డాలర్లను విరాళంగా ఇచ్చాడు. భారత్‌లో కరోనా రోగులకు ఆక్సిజన్ సప్లయ్ కొరత ఉన్న కారణంగా తనవంతు విరాళాన్ని ప్రకటించాడు.