తెలుగు థ్రిల్లర్ ఫ్యాన్స్‌లో ప్రత్యేక గుర్తింపుతో నిలిచిన “మా ఊరి పొలిమేర” ఇప్పుడు మూడో భాగంతో మరోసారి తెరపైకి రానుంది. ఓటిటీలో మొదటి భాగం సంచలన విజయాన్ని అందుకున్న తర్వాత, రెండో భాగం థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది.
హీరోగా సత్యం రాజేష్ తనే వన్ మాన్ షోగా అలరించాడు. ఇప్పుడు మూడో భాగం ప్రకటనతో ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది. ఈ సినిమాను డైరెక్టర్ డాక్టర్ అనీల్ విశ్వనాథ్ తెరకెక్కిస్తుండగా, తాజాగా ఈ సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల కానుందని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ ప్రకటనే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
2026 సంక్రాంతికి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, దళపతి విజయ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయి. అలాంటి హై వోల్టేజ్ రేస్‌లో ఓ మిడ్రేంజ్ చిత్రం అడుగు పెట్టడం సాహసమే కాని, కంటెంట్ ఉంటే ప్రేక్షకుల ఆదరణ తప్పదు అనే నమ్మకంతో మేకర్స్ ముందుకు వెళ్తున్నారు.
తక్కువ బడ్జెట్‌తో వచ్చినా, టర్నింగ్ పాయింట్లతో ఆకట్టుకునే మా ఊరి పొలిమేర సీరిస్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. మూడో భాగం కంటెంట్ కూడా అదే స్థాయిలో ఉంటే, ఈ చిత్రం మరోసారి థ్రిల్లింగ్ సక్సెస్ అందుకోవడం ఖాయం.