fbpx
Friday, December 13, 2024
HomeTop Movie Newsమా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు!

మా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు!

MAA-PRESIDENT-MANCHU-VISHNU

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది నెలలుగా తీవ్ర చర్చనీయాంశమైన మా అధ్యక్ష ఎన్నికల ఘట్టం మొత్తానికి ముగిసింది. ఎంతో తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ అధ్యక్ష ఎన్నికల్లో చివరికి మంచు విష్ణు తన ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్ పై గెలుపొందారు.

‘మా’ ఎన్నికల్లో గెలుపొందిన విజేతల వివరాలు ఇలా ఉన్నాయి:
మా అధ్యక్షుడు పదవికి ఎన్నికలో మంచు విష్ణుకు (383 ఓట్లు), ప్రకాశ్‌రాజ్‌ (274 ఓట్లు) లభించాయి. ఈ ఎన్నికలో 109 ఓట్ల తేడాతో విష్ణు గెలుపొందారు.

జనరల్ సెక్రటరీగా రఘుబాబు (341 ఓట్లు), ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ (375 ఓట్లు), జాయింట్ సెక్రటరీలు – ఉత్తేజ్ (333 ఓట్లు) , గౌతంరాజు (322 ఓట్లు), వైస్ ప్రెసిడెంట్స్‌ – మాదాల రవి (376 ఓట్లు), బెనర్జీ (298 ఓట్లు). ట్రెజరర్ గా‌ శివబాలాజీ (360 ఓట్లు).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular