మూవీడెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి ఇటీవలి కాలంలో హీరోగా పెద్దగా సినిమాలు చేయకపోయినా, ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
తన స్పిరిట్ మీడియా బ్యానర్ పై చిన్న సినిమాలు, కొత్త ప్రాజెక్ట్‌లను ముందుకు తీసుకెళ్తున్నాడు.
రీసెంట్ గా 35 చిన్న కథ కాదు, బాలీవుడ్ మూవీ జిగ్రా చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన రానా.. ఇప్పుడు మరో రీమేక్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడు.
2021లో తమిళంలో శింబు హీరోగా నటించిన ‘మానాడు’ సినిమా మంచి హిట్‌గా నిలిచింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ‘ది లూప్’గా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
అప్పట్లో సురేష్ ప్రొడక్షన్స్ తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేసింది. కానీ, సరైన హీరో దొరక్కపోవడంతో అది నిలిచిపోయింది.
ఇప్పుడు రానా ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయాలనుకుంటున్నాడు. ‘ఆకాశవాణి’ మూవీతో దర్శకుడిగా పరిచయమైన అశ్విన్ గంగరాజు ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం.
హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యేలా స్క్రిప్ట్‌లో మార్పులు కూడా చేశారట. రానా తన స్పిరిట్ మీడియా బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తీసుకొస్తున్నాడని తెలుస్తోంది.
హీరో ఎంపిక ఇంకా ఖరారు కాకపోయినా, రానా మాత్రం ఈ ప్రాజెక్ట్‌లో నటించట్లేదట. ‘మానాడు’ హిందీ రీమేక్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.