న్యూయార్క్: జెఫ్ బెజోస్ మాజీ భార్య అయిన బిలియనీర్ మాకెంజీ స్కాట్ మరోసారి తన దాతృత్వ హృదయాన్ని చాటుకున్నారు. ఆమె తాజాగా రూ. 20వేల కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. గివ్ ఇండియాతో పాటు మరికొన్ని సంస్థలకు ఆమె తన విరాళాన్ని ప్రకటించారు. చారిత్రాత్మకంగా అణగారిన, నిరాదరణకు గురైన వర్గాలకు మరియు సంఘాలకు ఈ నిధులను అందించనున్నట్టు ఆమె ఒక బ్లాగ్‌లో ప్రకటించారు.
ఆమె క్రితం ఏడాది జులై నెలలో అందించిన భారీ సాయంతో పాటు మాకెంజీ విరాళాల మొత్తం విలువ 8.5 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచం మొత్తంలోనే అత్యంత చురుకైన దాతగా గత ఏడాది రికార్డు సృష్టించిన మాకెంజీ గివ్ఇం డియా, గూంజ్ మి, అంతారా ఫౌండేషన్ లాంటి 286 మంది ఈ డొనేషన్‌ను అందించారు.
ఆమె పై పేర్కొన్న ఒక్కో సంస్థకు దాదాపు 10 మిలియన్ డాలర్ల చొప్పున ఈ విరాళాలను ఇచ్చారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు 2019 లో విడాకులిచ్చి, డాన్ జ్యువెట్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఇంత పెద్దమొత్తంలో విరాళాలు ప్రకటించడం ఇదే తొలిసారి. దీంతో విరాళాలను స్వీకరించిన సంస్థలు తమ కృతగ్నతను తెలిపాయి.
అయితే మాకెంజీ చేసిన దానం విలువ కొన్ని దేశాల మొత్తం జిడిపి కంటే చాలా ఎక్కువ. మరో బిలియనీర్, పరోపకారి అయిన బిల్, మెలిండా గేట్స్ గత 27 సంవత్సరాల్లో సుమారు 50 బిలియన్ డాలర్ల విరాళం ఇవ్వగా స్కాట్ కేవలం 12 సంవత్సరాలలో ఆ మొత్తాన్ని అందివ్వడం విశేషం.