మూవీడెస్క్: మ్యాడ్ 2! యువతను గిలిగింతలు పెట్టిన కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాగా రిలీజై భారీ వసూళ్లు సాధించింది.
దర్శకుడు కల్యాణ్ శంకర్ వినోదభరితమైన కథనం, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాణ విలువలు ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.
మ్యాడ్ సక్సెస్ అనంతరం మేకర్స్ సీక్వెల్ ప్రకటన చేయడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ‘
మ్యాడ్ 2’ కథ ముగ్గురు హీరోల ఫ్యామిలీ లైఫ్ చుట్టూ తిరగబోతుందని సమాచారం.
మేకర్స్ విడుదల చేసిన పోస్టర్, లడ్డూగాని పెళ్లి సాంగ్ ఇప్పటికే మంచి హైప్ తెచ్చాయి.
ఫ్యామిలీ లైఫ్‌ను హిలేరియస్‌గా చూపిస్తూ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారట.
ఇప్పటికే ‘మ్యాడ్ 2’ షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి.
ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేస్తారని తొలుత అనుకున్నప్పటికీ, ఇప్పుడు ఫిబ్రవరి నెలలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
వచ్చే నెలలో రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. మ్యాడ్ సీక్వెల్‌లో కొత్త కథతో పాటు కొత్త హీరోయిన్‌లు కూడా జతకానున్నారట.
శ్రీగౌరి ప్రియా, అనంతికా స్థానంలో మరో ముగ్గురు నాయికలు కనిపించనున్నారు.
భీమ్స్ సంగీతం, ఫన్ ఎలిమెంట్స్‌తో సీక్వెల్ మరింత వినోదాత్మకంగా ఉంటుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.
మరి మ్యాడ్ 2 ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో వేచి చూడాలి!