యువ హీరోలు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ల కలయికలో దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వేర్ థియేటర్లలో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
కమర్షియల్‌గా కూడా మంచి వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. నేటి నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అన్ని ప్రధాన భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
మళ్లీ సినిమా థియేటర్‌లో మిస్ అయ్యినవాళ్లు ఇప్పుడు ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. యూత్ ఫుల్ కంటెంట్, ఫ్రెండ్షిప్ ఎమోషన్స్, క్యాంపస్ ఫన్ అన్నీ కలగలిపిన ఈ మూవీని యువత విపరీతంగా ఎంజాయ్ చేశారు. సినిమాలోని వినోదం, మాటల బలమే కాదు.. మ్యూజిక్, టేకింగ్ కూడా ఆకట్టుకున్నాయి.
సితార ఎంటర్టైన్‌మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో విజయాన్ని అందుకున్న తరువాత ఇప్పుడు ఓటీటీలో కూడా అదే రెస్పాన్స్ రావడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి.