కథ:
లడ్డూ (విష్ణు) పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. కానీ పెళ్లికి ముందే పెళ్లి కూతురు మరొకరితో పారిపోతుంది. దాంతో అతడిని మనోభావంగా చక్కబెట్టేందుకు స్నేహితులు దామోదర్ (సంగీత్ శోభన్), అశోక్ (నార్నే నితిన్), మనోజ్ (రామ్ నితిన్) గోవా ట్రిప్ ప్లాన్ చేస్తారు. అక్కడ అనుకోకుండా ఓ విలువైన లాకెట్ వారి చేతిలో పడుతుంది. దాంతో పోలీసులు, మాఫియాలు వీళ్ల వెంటపడతాయి. చివరికి ఈ ఫన్ ట్రిప్ ఎలా మిస్టరీ అడ్వెంచర్‌గా మారింది? వారు ఈ చిక్కుల నుంచి ఎలా బయటపడ్డారు? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ:
‘మ్యాడ్ స్క్వేర్’ ముందుగా చెబుతున్నట్టే, ఇది పూర్తిగా లాజిక్ లేని కామెడీ డ్రామా. ఫస్ట్ హాఫ్ లో లడ్డూ పెళ్లి ట్రాక్ చుట్టూ తిరిగే హిలేరియస్ సన్నివేశాలు మంచి నవ్వులు పంచుతాయి. పెళ్లి కూతురు పారిపోయే ఎపిసోడ్, లడ్డూ ఫ్రెండ్స్ హడావుడి బాగా వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్ లో మిస్టరీ ఎలిమెంట్స్ జోడించి, కొత్త పేస్ తీసుకొచ్చారు. ముఖ్యంగా సునీల్ భాయ్ పాత్ర, సత్యం రాజేష్ పోలీస్ పాత్ర కామెడీ పండించాయి.
ప్లస్ పాయింట్స్:
పేస్: 2 గంటల 7 నిమిషాల చిన్న నిడివి కథను ఎక్కడా లాగకుండా మసాలా ఎంటర్‌టైనర్‌గా నిలిపింది.
కామెడీ: లడ్డూ పెళ్లి, గోవా ట్రిప్‌లోని హడావుడి ఎపిసోడ్స్ యూత్‌ను బాగా ఎంగేజ్ చేశాయి.
నటులు: నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్, విష్ణు హుషారుగా నటించి సినిమాకి ఎనర్జీ అందించారు.
మ్యూజిక్: భీమ్స్ సంగీతం కథకు బాగా సరిపడింది, పాటలు థియేటర్లో హుషారుని పెంచాయి.
2 మైనస్ పాయింట్స్:
లవ్ ట్రాక్ లేకపోవడం వల్ల ఎమోషనల్ కనెక్ట్ కాస్త తగ్గింది.
సెకండ్ హాఫ్ లో కొన్ని రొటీన్ సీన్స్
రేటింగ్: 3/5
లాజిక్ లేకున్నా.. ఫన్ ఉండాలి అనే వారి కోరికను తీరుస్తుంది ‘మ్యాడ్ స్క్వేర్’. వీకెండ్ కిక్‌కు ఓ సరదా ట్రిప్ అవుతుంది.