తమిళ హీరో శివకార్తికేయన్, టాప్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబోలో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మదరాసి రిలీజ్ డేట్ విషయంలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. సెప్టెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మాస్ ఫ్యాన్స్‌కి ఇది పండగే అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
తాజాగా రిలీజ్ అయిన పోస్టర్‌లో శివకార్తికేయన్ పూర్తిగా బ్రూటల్ మాస్ లుక్‌లో దర్శనమిచ్చాడు. ఫైట్స్, పేలుళ్ల నేపథ్యంలో యాక్షన్ మూడ్‌కు తగిన విజువల్స్‌తో పోస్టర్ ఆకట్టుకుంది. మురగదాస్ మార్క్ మాస్ ట్రీట్మెంట్‌కి ఇది ఓ టీజర్ లాంటిదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో ముంబై మాఫియా నేపథ్యంలో కథ నడుస్తుందన్న టాక్ వినిపిస్తోంది. శివకార్తికేయన్ క్యారెక్టర్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుందట. గతంలో చూడని ఓ అగ్రెసివ్ షేడ్‌ను మురగదాస్ ఈసారి చూపించనున్నారని సమాచారం.
రాక్ స్టార్ అనిరుధ్ అందిస్తున్న సంగీతం ఈ సినిమాకు మరింత హైప్ పెంచుతోంది. శివ-అనిరుధ్ కాంబోలో మ్యూజికల్ హిట్లు వచ్చిన అనుభవం ఉండటంతో మదరాసి ఆల్బమ్‌పై భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్‌లో మదరాసి ఎంత ఊపు తీసుకురావచ్చో చూడాలి.