హైదరాబాద్: తెలుగు నవలలు చదివే వారికి తెలుగు సాహిత్యాన్ని ఫాలో అయ్యే వారికి ‘మధు బాబు’ పేరు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన రాసిన చాలా నవలలు తెలుగులో చాలా ప్రసిద్ధి. ఈయన రాసిన ‘షాడో’ నవలలు చాలా మంది ఫాలో ఐతుంటారు. ప్రస్తుతం ఈ నవలలు దృశ్య రూపంలోకి అంటే వెబ్ సిరీస్ గా రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ‘మధుబాబు షాడో’ పేరు తో వీటిని రూపొందిస్తున్నారు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన ఈరోజే విడుదల చేశారు.
ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర దీనిని ‘ఏ కే ఎంటర్టైన్మెంట్స్‘ బ్యానర్ పైన రూపొందిస్తున్నట్టు, తమను నమ్మి విసువల్ ఫార్మాట్ ఫ్రాంచైజ్ ఏ కే ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి ఇచ్చినందుకు సోషల్ మీడియాలో ధన్యవాదాలు చెప్పారు. తన ప్రకటన లో ‘మీరు 20th సెంచరీ లో చదివింది 21st సెంచరీ లో అదే వ్యక్తిత్వం తో దృశ్య రూపం లో చూస్తారు’ అని చెప్పారు. ఈ వెబ్ సిరీస్ లో ఒక ప్రముఖ నటుడు నటిస్తాడని అనుకుంటున్నారు. త్వరలోనే నటీనటుల్ని అనౌన్స్ చేసి షూటింగ్ మొదలుపెట్టే పనుల్లో ఉన్నారు నిర్మాతలు.