ఉగాది స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మల్టీస్టారర్ మాస్ ఎంటర్టైనర్ “మ్యాడ్ స్క్వేర్” బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేశాడు.
సినిమాపై మొదటినుంచే మంచి హైప్ ఉండగా, విడుదలైన తొలి రోజే భారీగా ఆడియెన్స్ థియేటర్లకు పరుగులు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు నుంచే సాలిడ్ వసూళ్లు నమోదు చేసిన మ్యాడ్ స్క్వేర్… వరల్డ్ వైడ్‌గా ఏకంగా ₹20.8 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో చిత్రంపై మరింత హైప్ పెరిగింది. తెలుగు ఇండస్ట్రీలో ఒక చిన్న మల్టీహీరో సినిమాకి ఇంత ఆదరణ లభించడం విశేషమే.
మాస్, కామెడీ మిక్స్‌తో రూపొందిన ఈ చిత్రంలో సునీల్ పాత్ర కూడా హైలైట్‌గా నిలుస్తోంది. సునీల్ నుండి డార్క్ హ్యూమర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ చూసిన అనంతరం డే 2, వీకెండ్ బిజినెస్‌పై బయ్యర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు.
భీమ్స్ సంగీతం, సితార ఎంటర్టైన్మెంట్స్ – ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ విలువలు సినిమాకు ప్లస్ అయ్యాయి. మ్యాడ్ స్క్వేర్ మొదటి రోజు వసూళ్లు చూస్తే, ఇది సూపర్ హిట్ ట్రాక్‌లో ఉంది అని చెప్పొచ్చు.