మూవీడెస్క్: బాలీవుడ్‌లో వచ్చిన సూపర్ హిట్ అంధాధున్‌కు తెలుగు రీమేక్ నితిన్ నటించిన మూవీ మ్యాస్ట్రో. ఈ మూవీ సెప్టెంబర్ 17న ప్రముఖ ఓటీటీ యాప్స్ డిస్నీ+ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కెరీర్ లో మొదటి సారిగా నితిన్ అంధుడి పాత్ర పోషించడంతో మ్యాస్ట్రో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ‘మ్యాస్ట్రో’ఏ మేరకు ఈ అంచనాలు చేరుకుందో లేదో రివ్యూలో చూద్దాం.
కథ నేపథ్యం:
చూపున్న అంధుడిగా నటిస్తాడు అరుణ్(నితిన్). అరుణ్ లో ఉన్న ప్రత్యేక టాలెండ్ పియానోను చక్కగా వాయించడం. తన పియానో పాడవడంతో కొత్త పియానో కొనాలనుకుంటుండగా పెడ్రో అనే రెస్టారెంట్‌లో పియానో అమ్మకానికి పెట్టినట్లు తెలుసుకొని దాని కోసం అక్కడకు వెళ్తాడు. ఆ రెస్టారెంట్ లో తన మ్యూజిక్ ప్రతిభ చూపించి అందరి దగ్గర మన్ననలు పొందుతాడు.
అరుణ్ టాలెంట్ నచ్చి అతనితో ప్రేమలో పడిపోతుంది రెస్టారెంట్ ఓనర్ కూతురు సోఫీ(నభా నటేశ్). ఆ రెస్టారెంట్‌కు తరచు వచ్చే సినీ హీరో మోహన్ (వీకే నరేష్), అరుణ్ పియానో సంగీతానికి ఫిదా అయ్యి తన భార్య సిమ్రన్ (తమన్నా భాటియా)బర్త్‌డే సందర్భంగా ప్రైవేట్ కన్సర్ట్‌ను ఏర్పాటు చేయాలని అరుణ్‌ను తన ఇంటికి రమ్మని పిలుస్తాడు.
అరుణ్ మోహన్ ఇంటికి వెళ్లేసరికి మోహన్ ను ఎవరో హత్య చేసుంటారు. అయితే ఆ హత్య ఎవరు చేశారు? ఈ హత్యకు సిమ్రాన్, సీఐ బాబీ ( జిషు సేన్ గుప్తా)లకు ఉన్న సంబంధం ఏంటి? అరుణ్ అంధుడిగా ఎందుకు నటిస్తున్నాడు? మోహన్ హత్యతో అరుణ్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనేది పూర్తిగా తెలియాలంటే డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ సినిమాను చూడాల్సిందే.
బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా పోషించిన పాత్రను తెలుగులో నితిన్ పోషించాడు. ఆయుష్మాన్‌కు ధీటుగా అంధుడి పాత్రలో నటించి మెప్పించే ప్రయత్నం చేశారు. మొదటి ఆఫ్ లో అంధుడిగా నవ్వించిన నితిన్, రెండవ ఆఫ్ లో భావోద్వేగాలలో చక్కటి హావభావాలను చూపించాడు. ఈ సినిమాలో నితిన్ తర్వాత బాగా పండిన పాత్ర తమన్నాది.
సిమ్రన్ పాత్రలో ఆమె పరకాయ ప్రవేశం చేసింది. హిందీలో సీనియ హీరోయిన్ టబు పోషించిన పాత్ర అది. విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో తమన్నా ఒదిగిపోయింది. సోఫి పాత్రలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ బాగానే మెప్పించింది. ఇక మిగతా నటులు జిషు సేన్ గుప్త, నభా నటేశ్, శ్రీముఖి, రచ్చ రవి, మంగ్లీ, అనన్య నాగళ్ల, హర్ష వర్దన్ తమ పాత్రలకు తమ వంతు న్యాయం చేశారనే చెప్పాలి.
ఓవరాల్ మూవీ రేటింగ్: 3/5