fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsనితిన్ 'మేస్ట్రో' ఓటీటీ రిలీజ్ అప్ డేట్

నితిన్ ‘మేస్ట్రో’ ఓటీటీ రిలీజ్ అప్ డేట్

Maestro OTTRelease Update

టాలీవుడ్: థియేటర్ లు తెరుచుకున్న కూడా ఓటీటీ రిలీజ్ లు తగట్లేదు. నిన్ననే కమెడియన్ సత్య హీరోగా నటించిన ‘వివాహ భోజనంబు’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ రోజు యూత్ హీరో నితిన్ నటించిన ‘మేస్ట్రో’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ సంవత్సరం ‘చెక్’, ‘రంగ్ దే’ సినిమాలని విడుదల చేసిన నితిన్ ‘మేస్ట్రో’ రూపం లో మూడవ రిలీజ్ ని కూడా సిద్ధం చేసాడు. హిందీ లో ఆయుష్మాన్ ఖురానా హీరో గ రూపొందిన ‘అందాదున్’ సినిమాని తెలుగులో ‘మేస్ట్రో’ పేరుతో రీ మేక్ చేస్తున్నాడు. దృష్టి లోపం ఉన్న పాత్రలో ఈ సినిమాలో నితిన్ నటిస్తున్నాడు.

గత కొద్దీ రోజులుగా ఈ సినిమా ఓటీటీ లో విడుదల అవనున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన రాలేదు. ఈ రోజు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో నితిన్ తో పాటు నభ నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మరో సీనియర్ ఆంటీ పాత్రలో తమన్నా నటిస్తుంది. ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలు ఆకట్టుకున్నాయి. భీష్మ సినిమాకి సంగీతం అందించిన మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. నితిన్ హోమ్ బ్యానర్ అయిన శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ ని ఆగష్టు 23 న విడుదల చేయబోతున్నాం అని ప్రకటించడమే కాకుండా హాట్ స్టార్ ఓటీటీ లో విడుదల అవనున్నట్టు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular