టాలీవుడ్: RX100 సినిమాతో మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ సాధించిన దర్శకుడు అజయ్ భూపతి. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత రెండవ సినిమా సిద్ధం చేస్తున్నాడు. చాలా మంది హీరోల పేర్లు వినిపించిన తర్వాత ‘శర్వానంద్’ తో ‘మహా సముద్రం’ అనే టైటిల్ తో సినిమా రూపొందిస్తున్నాడు ఈ డైరెక్టర్. మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మరో హీరో గా ‘సిద్దార్థ్’ నటిస్తున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత సిద్దార్థ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అదితి రావు హైదరి , అను ఎమాన్యూల్, జగపతి బాబు, రావు రమేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టింది.
ఈ సినిమా నుండి మొదటి పాటని ఈ రోజు విడుదల చేసారు. ‘రంభా రంభా’ అంటూ సాగే ఈ పాట ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ సాంగ్ గా రూపొందించారు. వైజాగ్ బీచ్ లో ఎగ్జిబిషన్ బ్యాక్ డ్రాప్ లో ఈ పాటని షూట్ చేసారు. ఈ పాటలో జగపతి బాబు తో స్టెప్స్ వేస్తున్న శర్వానంద్ ని చూపించారు. చేతన్ భరద్వాజ్ సంగీతం లో రూపొందిన ఈ పాటని ఆయనే ఆలపించారు. AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ బ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పూర్తి ఇంటెన్స్ యాక్షన్ మరియు లవ్ స్టోరీ గా రూపొందిన ఈ సినిమా షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. మరి కొద్ది రోజుల్లో థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.