fbpx
Monday, September 16, 2024
HomeMovie Newsదసరా కి శర్వా 'మహా సముద్రం'

దసరా కి శర్వా ‘మహా సముద్రం’

MahaaSamudram Release Update

టాలీవుడ్: RX100 సినిమాతో మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ సాధించిన దర్శకుడు అజయ్ భూపతి. రెండవ సినిమాకి కొంచెం టైం తీసుకుని మంచి కాస్టింగ్ తో ‘మహా సముద్రం’ అనే సినిమాని రూపొందించాడు. ఈ సినిమాని మంచి ఎమోషనల్ లవ్ మరియు యాక్షన్ సినిమాగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాని మల్టీ స్టారర్ గా రూపొందించారు. వెర్సటైల్ ఆక్టర్ శర్వానంద్ మరియు బొమ్మరిల్లు సిద్దార్థ్ ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు. హీరోయిన్ లుగా అదితి రావు హైదరి మరియు అను ఎమాన్యూల్ నటిస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత సిద్దార్థ్ ఈ సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమాతో మళ్ళీ రానున్నాడు.

ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ మరియు టీజర్స్ ఆకట్టుకున్నాయి. శర్వా కి సంబందించిన ఒక మాస్ పాట కూడా పరవాలేదనిపించింది. సీనియర్ ఆక్టర్స్ జగపతి బాబు మరియు రావు రమేష్ ముఖ్య పాత్రల్లో ఈ సినిమాలో నటిస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకుంది. AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ బ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మించారు. చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమాని దసరా సందర్భంగా అక్టోబర్ 14 న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కానీ అక్టోబర్ 13 న RRR విడుదల ఉండడం, ఒకవేళ ఎలాంటి సమస్యలు లేకపోతే అక్టోబర్ 13 న RRR విడుదలైతే ఈ సినిమా ఇంకో రోజుకి విడుదల తేదీ ని మార్చుకోక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular