టాలీవుడ్: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నాడు. ప్రభాస్ మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ఒక సినిమా ప్రకటించాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలవలేదు కానీ అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమా గురించి నాగ్ అశ్విన్ ఒక్కో అప్డేట్ విడుదల చేస్తూ ఉన్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీ గా దీపికా పదుకోన్ నటిస్తుంది. ఈ సినిమాకి పనిచేయబోయే మరి ఇద్దరు టెక్నిషియన్స్ ని ప్రకటించారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. మహానటి పని చేసిన కళ్ళు మరియు చెవులు ప్రభాస్ సినిమాకి కూడా పని చేయబోతున్నట్టు కళాత్మకంగా ప్రకటించారు. మహానటి కి పని చేసిన కళ్ళు అంటే సినిమాటోగ్రఫీ , డానీ సాంచెజ్ లోపెజ్ ఈ సినిమాకి కూడా పని చేయబోతున్నాడని చెప్పారు.
మహానటి కి పని చేసిన చెవులు అంటే సంగీత దర్శకుడు, మిక్కీ జె మేయర్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు. మిక్కీ ఒక పెద్ద హీరో కి సంగీతం అందించడం ఇదే మొదటిది. కానీ ఇది ఒక మాస్ మసాలా సినిమా కాదు, సైన్స్ ఫిక్షన్ జానర్ కాబట్టి మిక్కీ కి తనని తను ప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశం దక్కింది అని చెప్పవచ్చు. వీరిద్దరి గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ మహానటి లో పాస్ట్ లోకి తీసుకెళ్ళాం ఇప్పుడు ఫ్యూచర్ ని వీళ్లతోనే చూపించబోతున్నాం అని ట్వీట్ చేసారు. పాన్ ఇండియా లెవెల్ లో రూపూందుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా నటించనున్నాడు. వైజయంతి మూవీస్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి అడుగు చాలా జాగ్రత్త గా వేస్తూ ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది.