మూవీడెస్క్: కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి ల్యాండ్‌మార్క్ మూవీ మహారాజా ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన అందుకున్న సంగతి తెలిసిందే.
యంగ్ డైరెక్టర్ నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది.
థియేటర్స్ లోనే కాకుండా ఓటీటీలో కూడా అదరగొట్టింది. ఇప్పుడు ఈ సినిమా చైనాలో నవంబర్ 29న భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఏకంగా 40 వేల స్క్రీన్స్‌లో విడుదల చేస్తారని టాక్ వినిపిస్తోంది. యిషి ఫిల్మ్స్, అలీబాబా పిక్చర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ప్రీమియర్ షోలోనే లక్షా 30 వేల డాలర్ల వసూళ్లు సాధించి, చైనీస్ ఆడియన్స్‌ను మెప్పించింది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ అక్కడ కూడా బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు.
ఇప్పటికే చైనాలో అనేక ఇండియన్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
అమీర్ ఖాన్ దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్, శ్రీదేవి MOM, రాణి ముఖర్జీ హిచ్కీ లాంటి సినిమాలు చైనీస్ ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్నాయి.
మహారాజా కూడా అదే రీతిలో చైనాలో బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటి వరకు చైనాలో ఇండియన్ మూవీస్‌లో హైయెస్ట్ గ్రాసర్ దంగల్ కాగా, మహారాజా 700 కోట్లకుపైగా వసూళ్లు సాధించే అవకాశముందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
విజయ్ సేతుపతి పెర్ఫార్మెన్స్ ఈ గొప్ప రికార్డును సాధిస్తుందేమో వేచి చూడాలి!