fbpx
Thursday, December 5, 2024
HomeAndhra Pradeshమహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకారం.. అతిధులుగా ఏపీ నేతలు

మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకారం.. అతిధులుగా ఏపీ నేతలు

Maharashtra CM’s oath-taking ceremony AP leaders as guests

మహారాష్ట్ర: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మహారాష్ట్ర సీఎం పదవి కోసం నెలకొన్న హైడ్రామాకు చివరకు తెరపడింది. బీజేపీ కోర్ కమిటీ మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఖరారు చేసింది.

బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఫడ్నవీస్‌ను తమ నేతగా ఎన్నుకున్నారు.

ఫడ్నవీస్ ఈ నెల 5న ముంబైలోని ఆజాద్ మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు హాజరుకాబోతున్నారు.

ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరుకానున్నారు. పవన్ మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్న విషయం తెలిసిందే.

ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాలను గెలుచుకోవడంతో, బీజేపీ పెద్దలు ఫడ్నవీస్‌ను సీఎం పదవికి ఎంపిక చేశారు. మంత్రివర్గ కూర్పులో 43 మంది సభ్యులకు చోటు కల్పించనున్నారు.

బీజేపీకి 21 మంత్రివర్గ స్థానాలు దక్కుతాయి. ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) 10, శివసేన (ఏక్ నాథ్ షిండే వర్గం) 12 స్థానాలను పొందుతాయి.

డిప్యూటీ సీఎం పదవులు ఎన్సీపీ, శివసేన వర్గాలకు కేటాయించనున్నారు. హోంమంత్రి, స్పీకర్ వంటి కీలక పదవులు బీజేపీ హస్తగతమవుతాయి.

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం తర్వాత బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని మరింత బలంగా ముందుకు నడిపించగలదా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular