ముంబై: మహారాష్ట్రలో ఓ గ్యాంగ్‌స్టర్ జైల్ నుండి రిలీజ్, మళ్ళీ అరెస్ట్ అయిన సంఘటన చోటు చేసుకుంది.
జైలు నుండి రిలీజ్ అయినందుకు చేసిన సంబర ర్యాలీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతను తిరిగి జైలుకు వెళ్ళాల్సి వచ్చింది.
నాసిక్ గ్యాంగ్‌స్టర్ హర్షద్ పటంకర్ మహారాష్ట్ర స్లమ్‌లార్డ్స్, బూట్‌లెగర్స్, డ్రగ్ ఆఫెండర్స్ మరియు డేంజరస్ పర్సన్స్ యాక్ట్ క్రింద జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
కాగా, జులై 23న జైలు నుండి విడుదలైన తర్వాత, అతని మద్దతుదారులు అతని విడుదలను జరుపుకునేందుకు ఒక కార్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 15 ద్విచక్ర వాహనాలు కూడా పాల్గొన్నాయి.
బేతెల్ నగర్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు ఈ ర్యాలీ నిర్వహించబడినట్లు తెలుస్తోంది. అయితే, వైరల్ అయిన ఈ వీడియోలో, పటంకర్ కార్ సన్‌రూఫ్ నుండి తన మద్దతుదారులకు అభివాదం చేస్టూ కనిపిస్తున్నాడు.
అతని మద్దతుదారులు ఈ ర్యాలీ రీల్స్‌ను “కంబ్యాక్” శీర్షికతో సోషల్ మీడియాలో పంచుకున్నారు. కానీ ఈ రీల్స్ పోలీస్ చర్యకు దారితీశాయి.
పటంకర్ మరియు అతని ఆరుగురు సహచరులు అనధికారిక ర్యాలీ నిర్వహించి కలహం సృష్టించినందుకు అరెస్టు చేయబడ్డారు.
నివేదికల ప్రకారం, అతని పై అనేక పోలీస్ కేసులు నమోదయ్యాయి, వాటిలో హత్యాయత్నం, దొంగతనం మరియు హింస ఉన్నాయి.