న్యూఢిల్లీ: మహరాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల! మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న ఒకే విడతలో నిర్వహించబడతాయని మంగళవారం ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఈ ఎన్నికల ఫలితాలను నవంబర్ 23న లెక్కింపు తరువాత ప్రకటించబడతాయి.
దీనితో పాటు, ఈ సంవత్సరం నిర్వహించనున్న చివరి ఎన్నికల్లో జార్ఖండ్ మరియు మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి.
కాగా, జార్ఖండ్ రెండు విడతలుగా ఎన్నికలు జరుపుకోనుంది.
మొదటి విడత నవంబర్ 13న ప్రారంభం కాగా, రెండవ విడత నవంబర్ 20న జరగనుంది.
అయితే, ఈ ఫలితాలు కూడా నవంబర్ 23న లెక్కించి వెల్లడించనున్నారు.