fbpx
Monday, September 16, 2024
HomeMovie Newsమహేష్ బాబు రాజమౌళి.. ఇది లేటెస్ట్ అప్డేట్

మహేష్ బాబు రాజమౌళి.. ఇది లేటెస్ట్ అప్డేట్

MAHESH-BABU-RAJAMOULI-SSMB29-UPDATE
MAHESH-BABU-RAJAMOULI-SSMB29-UPDATE

మూవీడెస్క్: దర్శకధీరుడు రాజమౌళి, హీరో మహేష్ బాబు తో చేస్తున్న సినిమా కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రాజెక్ట్ SSMB29 పేరుతో రూపొందుతోంది. RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాజమౌళి, మహేష్ బాబుతో ఈ ప్రాజెక్ట్‌ను మరింత గ్రాండ్ గా హై లెవెల్లో తెరపైకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వివరాలు ఇప్పటికే బయటకు వచ్చాయి. కథా నేపథ్యం ఆఫ్రికా అడవులు అని, ఇది ఇండియానా జోన్స్ తరహా యాక్షన్ అడ్వెంచర్ కథగా ఉంటుందని సమాచారం.

స్టోరీ లైన్ పై విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చినప్పటికీ, పూర్తిస్థాయి వివరాలు ఇంకా అధికారికంగా బయటకు రాలేదు.

అయితే, ప్రీ ప్రొడక్షన్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. త్వరలోనే వర్క్‌షాప్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఇక సినిమా కోసం పని చేస్తున్న TP విజయన్ అనే ఆర్టిస్ట్ ఇటీవల ఒక రెండు గోల్డెన్ రెక్కల ఆర్ట్ వర్క్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దీనితో సినిమా యాక్షన్ అడ్వెంచర్ గా ఉంటుందని, భారీ వ్యూహంతో తెరకెక్కనున్నట్లుగా అర్థమవుతోంది. ఈ ప్రాజెక్ట్ పై రాజమౌళి ఎంతగానో శ్రద్ధ చూపిస్తున్నారని, మహేష్ బాబును ఇంతకుముందెన్నడూ చూడని శైలిలో ప్రజెంట్ చేయబోతున్నారని తెలుస్తోంది.

ఇక ఈ ఏడాది చివరలో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular