మూవీడెస్క్: సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు (MAHESH BABU) మేనల్లుడు అశోక్ గల్లా తన తొలి చిత్రం “హీరో” తో మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం “దేవకీ నందన వాసుదేవ” (DEVAKI NANDANA VASUDEVA) సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి “గుణ 369” ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు.
డివైన్ ఎలిమెంట్స్ తో యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. అశోక్ సరసన తెలుగు అమ్మాయి మానస వారణాసి నటిస్తున్నారు.
ఈ సినిమాపై తాజాగా మహేష్ బాబు అభిమానులకు చక్కటి వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.
మహేష్ బాబు కృష్ణుడి గెటప్ లో ఈ సినిమాలో చిన్న క్యామియో రోల్ లో కనిపించనున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
దీపావళి కానుకగా మహేష్ బాబు యొక్క ఈ లుక్ పోస్టర్ విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం.
మహేష్ అభిమానులు ఇప్పటికే ఏఐ ఇమేజెస్ ద్వారా కృష్ణుడి లుక్ లో మహేష్ ఎలా ఉంటారో ఊహించుకుని సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
సాధారణంగా మహేష్ తన ఫ్యామిలీ మెంబర్స్ ప్రాజెక్టులకు ప్రమోషనల్ సపోర్ట్ అందిస్తారు. కానీ, ఓ క్యామియో రోల్ లో కనిపిస్తే ఇది మహేష్ కెరీర్ లో ప్రత్యేక ఘట్టం అవుతుంది.
మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో, మహేష్ నిజంగా కృష్ణుడి పాత్రలో కనిపిస్తారో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.