మూవీడెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కోసం ఒక మంచి వార్త బయటకొచ్చింది. ఈసారి మహేష్ బాబు హాలీవుడ్ సినిమా కోసం వర్క్ చేయనున్నాడు, అది కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా.
డిస్నీ సంస్థ రూపొందించిన ముఫాస అనే యానిమేటెడ్ చిత్రానికి తెలుగు వెర్షన్ లో మహేష్ తన గొంతు అందించనున్నారు.
అఫీషియల్ గా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. ‘ది లయన్ కింగ్’ కి ప్రీక్వెల్‌గా రాబోతున్న ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే ‘జల్సా’, ‘బాద్‌షా’, ‘ఆచార్య’ వంటి తెలుగు సినిమాలకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చి మంచి పేరు సంపాదించుకున్నారు.
కానీ హాలీవుడ్ సినిమా కోసం డబ్బింగ్ చేయడం మాత్రం మహేష్‌కు ఇది తొలిసారి. ఇది ఆయన కోసం సరికొత్త మైలురాయి అని చెప్పొచ్చు.
ముఖ్యంగా పిల్లలు, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ లో మహేష్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని డిస్నీ వారు మహేష్ బాబును ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకున్నారు.
మహేష్ గొంతు ముఫాస పాత్రకు మరింత ప్రాణం పోస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ముఫాస సినిమా ట్రైలర్ ఆగస్టు 26న విడుదల కానుంది.
దీనికి సంబంధించిన ఆసక్తి ఇప్పటికే పెరిగిపోయింది. ఇక మహేష్ తన తదుపరి సినిమాను రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే.