fbpx
Sunday, January 19, 2025
HomeMovie News'సర్కారు వారి పాట' మోషన్ పోస్టర్ విడుదల

‘సర్కారు వారి పాట’ మోషన్ పోస్టర్ విడుదల

Mahesh NewMovie MotionPoster

టాలీవుడ్ : ముందుగా చెప్పినట్టుగానే మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మోషన్ పోస్టర్ విడుదల చేసింది సర్కారు వారి పాట సినిమా టీం. అభిమానులని సంతోషపరచడానికి విడుదల చేసిన ఈ మోషన్ పోస్టర్ లో చెప్పుకోదగ్గ విశేషాలైతే ఏమి లేవు. కాగా కరోనా పరిస్థితుల వల్ల షూటింగ్ కూడా పూర్తి స్థాయిలో ప్రారంభం అవని ఈ సినిమా నుండి అంత కన్నా ఆశించడం కూడా ఎక్కువ అవుతుంది. ఈ మోషన్ పోస్టర్ లో వచ్చిన బాగ్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంత మాత్రం గానే ఉందని ట్రోల్ల్స్ వస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం లో థమన్ ఇచ్చిన అల్ టైం మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘అల వైకుంఠపురం లో ‘ సినిమా మ్యూజిక్ క్వాలిటీ రేంజ్ లో ఈ సినిమా టీజర్ మ్యూజిక్ లేదు అనేది టాక్.

స్క్రిప్ట్ విషయం లో చాలా జాగ్రత్తలు పడి సుకుమార్ సినిమా కూడా వొదులుకుని మహేష్ బాబు ఈ సినిమా చేస్తున్నాడు అంటే సినిమా కథ పైన అంచనాలు చాలానే ఉన్నాయి. పరశురామ్ ఇప్పటివరకు తన కెరీర్ లో ఒక్క యువత సినిమా తప్ప మిగతా అన్ని సినిమాలు కుటుంబం, ప్రేమ వీటి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమా ద్వారా కొత్త జానర్ ని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటివరకైతే ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్నట్టు తానే ఒక సోషల్ మీడియా లైవ్ చాట్ లో చెప్పింది. మిగతా కాస్టింగ్ అంతా ఫైనల్ కావాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular