హైదరాబాద్: మొన్నటి వరకు కరోనా వల్ల ఇంటికే పరిమితం అయిన స్టార్స్ అందరూ ఇప్పుడు మెల్లి మెల్లిగా ఒకరి తర్వాత ఒకరు షూటింగ్ లు మొదలు పెడుతున్నారు. కరోనా ఇప్పుడప్పుడే తగ్గు ముఖం పట్టకపోవడం తో ఇపుడు కరోనా తో సహజీవనం తప్పదని ప్రభుత్వమే నిబంధనల్ని సడలిస్తూ అన్ని అనుమతులు ఇస్తుంది. ఈ క్రమం లోనే నిబంధనల్ని పాటిస్తూ షూటింగ్ చేసుకోవచ్చని అనుమతులిచ్చింది. ఇపుడు మహేష్ కూడా షూటింగ్ మొదలు పెట్టేసాడు. కానీ ఇది తాను నటించబోతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకి సంబందించిన షూట్ కాదు. ఒక యాడ్ కి సంబందించిన షూట్. అన్నపూర్ణ స్టూడియో లో జరగబోతున్న ఒక యాడ్ షూట్ కోసం మహేష్ కొద్దీ రోజులు షూటింగ్ లో పాల్గొన బోతున్నారు. ఈ షూట్ కోసం నేషనల్ లెవెల్ యాడ్ ఫిలింమేకర్ అవినాశ్ గోవారికర్ రూపొందిస్తున్నారు.
ఈ షూట్ నుండి ఒక పిక్ కూడా లీక్ అయింది. అయితే షూటింగ్ ముగిసిన తర్వాత అవినాశ్ గోవారికర్ షేర్ చేసిన ఒక ఫోటో మాత్రం అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. మహేష్ బాబు లేటెస్ట్ లుక్ కళ్ళు చెదిరేవిధంగా ఉందని సోషల్ మీడియా లో టాక్. దీనిపై మహేశ్ బాబు వ్యాఖ్యానిస్తూ మళ్లీ పనిలో దిగడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.