సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మరో బిగ్ సెలబ్రేషన్‌కు అభిమానులు రెడీ అవుతున్నారు. ఆగస్టు 9న మహేష్ బర్త్‌డే స్పెషల్‌గా అతడు 4K వెర్షన్‌తో రీ రిలీజ్ కానుంది. గతంలో మురారి, బిజినెస్‌మెన్ రీ రిలీజ్‌లు సక్సెస్ సాధించగా, ఈసారి అతడు మరింత గ్రాండ్‌గా థియేటర్లలో సందడి చేయబోతుంది.
అతడు మహేష్ కెరీర్‌లో ఓ ట్రెండ్ సెట్టర్. థియేటర్లలో మంచి విజయం సాధించినా, అసలు ఫాలోయింగ్ టీవీ టెలికాస్ట్ తర్వాత పెరిగింది. మణిశర్మ సంగీతం, త్రిష గ్లామర్, బ్రహ్మానందం కామెడీ, నాజర్ ఎమోషన్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాను క్లాసిక్‌గా నిలిపాయి.
ఈ రీ రిలీజ్ కోసం 4K రీమాస్టర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్పెషల్ సౌండ్ మిక్సింగ్‌తో థియేటర్ల అనుభూతి మరింత ఎంజాయ్ చేయడానికి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.
మహేష్ పుట్టినరోజున భారీ స్క్రీన్‌లపై అతడు రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్లలో పోటీ మొదలైంది. నిర్మాత మురళీ మోహన్ ప్రత్యేకంగా ఈ డీల్‌ను క్లోజ్ చేయనున్నట్లు సమాచారం.
ఈ రీ రిలీజ్ SSMB29 రాక ముందే మహేష్ హవాను మరింత పెంచనుంది. మహేష్ ఫ్యాన్స్‌కి ఇది పక్కా ఫెస్టివల్ అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.