సూపర్ స్టార్ కృష్ణగారు బ్రతికున్నప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావించిన సినిమా ఛత్రపతి శివాజీ. మరాఠా యోధుడి వీరగాథను భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని ఎన్నోసార్లు అనుకున్నా, అనేక అవాంతరాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ రోజుల్లో ప్యాన్ ఇండియా ట్రెండ్ లేకపోవడంతో, కమర్షియల్ వాల్యూ తక్కువగా ఉంటుందనే అనుమానాలు వ్యక్తమయ్యేవి.
ఇప్పటి పరిస్థితులు చూస్తే, మరాఠా వీరుల కథలకు పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన ఆదరణ ఉంది. తానాజీ విజయంతో అజయ్ దేవగన్ ఇది రుజువు చేస్తే, విక్కీ కౌశల్ నటించిన సామ్రాట్ ప్రతాప్ చావా మరింత హైప్ ను క్రియేట్ చేసింది. ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌లో మహేష్ బాబు ఛత్రపతి శివాజీ పాత్రలో కనిపిస్తే అద్భుతం అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న SSMB 29 సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందనున్నారు. ఆ తరువాత మహేష్ పాన్ వరల్డ్ స్టార్ గా మారడం ఖాయం. అలాంటి ఇమేజ్ తో ఛత్రపతి శివాజీ గెటప్ లో కనిపిస్తే, అది నిజంగా చరిత్ర సృష్టించే ప్రాజెక్ట్ అవుతుంది.
ఇలాంటి ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయగల సమర్థవంతమైన దర్శకుడు దొరకడం కూడా చాలా ముఖ్యమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో మరాఠా యోధుల కథలపై పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. శంభాజీ మహారాజ్ కథ కూడా ఆ లిస్టులో చేరింది.
మొత్తానికి, మహేష్ బాబు ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తే, అది సూపర్ స్టార్ కృష్ణ గారి కలను సాకారం చేయడమే కాకుండా, టాలీవుడ్ చరిత్రలో ఒక భారీ ప్రాజెక్ట్‌గా నిలవడం ఖాయం.