టాలీవుడ్: తెలుగు వాళ్లందరికీ పెద్ద పండగ సంక్రాంతి, అలాగే సినిమా వాళ్ళకి కూడా సంక్రాంతి పెద్ద పండగ. ఆ టైం లో సినిమాలు విడుదల చేయడానికి పోటీ పడుతుంటారు. మహేష్ బాబు సంక్రాంతి టైం లో ఇదివరకే ‘ఒక్కడు’ లాంటి కెరీర్ టర్నింగ్ పాయింట్ మూవీ విడుదల చేసి హిట్ కొట్టాడు. అంతే కాకుండా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘సరిలేరు నీకెవ్వరూ’ ,’బిసినెస్ మాన్’ సినిమాలు విడుదల చేసి సంక్రాతి టైం లో మంచి రికార్డులు నెలకొల్పాడు. ఈ హీరో ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ మధ్యనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా టీం విడుదల తేదీ ప్రకటించి షాక్ ఇచ్చింది. ఈ సినిమా కూడా సంక్రాంతి కి విడుదల చేయనున్నట్టు ఈరోజు ప్రకటించారు.
‘గీత గోవిందం’ సూపర్ హిట్ అయిన తర్వాత దర్శకుడు పరశురామ్ చేయబోతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా కోసం దర్శకుడు చాలా గ్యాప్ తీసుకొని స్క్రిప్ట్ పైన చాలా వర్క్ చేసి ఈ సినిమా రూపొందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ,జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ ,14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ కలిసి ఈ సినిమాని రూపొందిస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ కి జోడీ గా మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది. దాదాపు ఎక్కువ భాగం షూటింగ్ వేరే దేశాల్లోనే ఈ సినిమా జరుపుకోబోతుంది. ఆర్థిక నేరగాళ్ల కోణం లో ఈ సినిమా ఉండబోతుందని అర్ధం అవుతుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా మహేష్ మరో సంక్రాంతి హిట్ కొట్టాలని చూస్తున్నాడు.