టాలీవుడ్: తెలుగు భాషలో పాత రచయితలు చాల మంది ఫేమస్. ఇపుడున్న చాలా మంది టాప్ మోస్ట్ డైరెక్టర్లు వాల్ల పేర్లు చెప్తుంటే వాళ్ళ రచనలు చదవాలి అనిపిస్తుంది. అందులో చలం, కృష్ణ శాస్త్రి, దాశరథి లాంటి కొన్ని పేర్లు వినిపిస్తాయి. ఇపుడు పాత తెలుగు రచనల్ని సినిమాలుగా, వెబ్ సిరీస్ లుగా మార్చి మన సంస్కృతి ని సాహిత్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి మరో ప్రయత్నమే చలం రచించిన ‘మైదానం’ అనే నవలని అదే పేరుతో సినిమాగా తీస్తున్నారు. ఇంకా షూటింగ్ మొదలవ్వని ఈ సినిమా ని ఆహ లో విడుదల చెయ్యబోతున్నారు. 1927 లో చలం నుండి వచ్చిన ‘మైదానం’ అనే అద్భుతమైన నవల ఆధారంగా ఈ సినిమా రాబోతుంది.
‘నీది నాది ఒకే కథ‘, ‘విరాట పర్వం’ లాంటి కొత్త రకమైన కథలతో సినిమాలు చేస్తున్న డైరెక్టర్ వేణు ఊడుగుల. ఈ డైరెక్టర్ ఈ సినిమాతో నిర్మాత గా మారనున్నాడు. కవి సిద్దార్థ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. దాదాపు కొత్తవారితోనే ఈ సినిమా రూపొందుతుంది. కంటెంట్ విషయం లో చాలా ఫాస్ట్ గా దూసుకెళ్తున్న ఆహ ఓటీటీ ఈ సినిమాని కూడా స్ట్రీమ్ చేయబోతుంది. చాలా అవార్డులు గులుచుకున్న ఈ నవల సినిమాగా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. అన్నీ కుదిరితే మరొక మంచి కథ ద్వారా సినిమా అభిమానుల దాహం తీరినట్టు అవుతుంది.