టాలీవుడ్: టాలీవుడ్ లో ఉన్న యువ హీరోల్లో తన సినిమాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడవి శేష్. కేవలం హీరో గానే కాకుండా తాను చేసే ప్రతీ సినిమా కథ, కథనం విషయం లో కూడా అడవి శేష్ తన ప్రతిభ చూపిస్తుంటారు. క్షణం, గూఢచారి, ఎవరు లాంటి సినిమాలు అందుకు నిదర్శనం. దర్శకుడు మారినా కానీ ఫలితం మాత్రం మారదు. ఈ హీరో ప్రస్తుతం ‘మేజర్’ అనే ఒక రియల్ లైఫ్ సోల్జర్ కథతో మన ముందుకు వస్తున్నాడు. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో చాలా మంది ప్రజలని కాపాడి వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఈ సినిమా రూపొందబోతుంది.
26 /11 అంటే ముందుగా గుర్తొచ్చేది ముంబై కాల్పులు, ఆ కాల్పుల్లోనే ఎంతో మందిని కాపాడి మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ఉగ్రావాదుల చేతుల్లో హతమయ్యాడు. ఆయనని గుర్తు చేస్తూ ఈ సినిమా ఎలా ముందుకు వెళ్ళింది అని అడవి శేష్ ఈ సినిమా కథ ప్రారంభం అవడానికి ముందు ఉన్న కథ చెప్పాడు. ముంబై ఘటనలు జరిగేప్పుడు తాను అమెరికా లో ఉండేవాడినని ఈ ఘటనపై సంబందించిన కొన్ని న్యూస్ పేపర్ ఆర్టికల్స్, మరియు పోస్ట్స్ తాను ప్రింట్ తీస్కొని పెట్టుకునేవాడినని, ఎపుడూ వీటి గురించి ఆలోచించేవాడినని ఇండస్ట్రీ కి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇలాంటి ఒక కథ కోసం తాను కష్టపడుతున్నాని చెప్పాడు. ఈ కథ అనుకున్న తర్వాత మేజర్ సందీప్ వాల్ల తల్లి తండ్రుల దగ్గరికి వెళ్ళాక వాల్లు నమ్మలేదని.. కానీ కొన్ని రోజులు కొన్ని డిస్కషన్స్ తర్వాత వాళ్ళకి నమ్మకం కలిగిందని చెప్పారు.
మేజర్ సినిమా కోసం ఉన్ని కృష్ణన్ గారి ఫోటో చూసినపుడు ఆ కళ్ళల్లో ఉన్న దైర్యం, నిజాయితీ తనకి చాలా నచ్చాయని అది నన్నెప్పుడు ఇన్స్పైర్ చేస్తుందని అలాగే తాను కూడా ఒక ఫోటో తీయించుకున్నానని తెలిపాడు. ఇందులో మేజర్ సందీప్ హాఫ్ పేస్ కి మేజర్ రోల్ చేస్తున్న శేష్ హాఫ్ పేస్ ను అతికించి ఆసక్తికరంగా చూపించారు. అంతే కాకుండా ఒకసారి మేజర్ సందీప్ వాల్ల తల్లి గారు అడవి శేష్ ని అలా సడన్ గా చూసి తన కొడుడు మేజర్ సందీప్ లాగే అనిపించాడని కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు. సోనీ పిక్చర్స్ వారు సూపర్ స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. అంతే కాకుండా మేజర్ ఫస్ట్ లుక్ పోస్టర్ డిసెంబర్ 17 న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.