ది టూ స్టేట్స్ డెస్క్: మకర సంక్రాంతి (Makar Sankranti 2025) భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రత్యేకమైన పండుగ. ప్రతి సంవత్సరం జనవరి 14 లేదా 15న ఈ పండుగను జరుపుకుంటారు.
ఇది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సందర్భాన్ని సూచిస్తుంది. రైతులు ధాన్యం పంటను కోసిన తర్వాత ప్రకృతి, పశువులను గౌరవిస్తూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.
ముగ్గులు, గంగిరెద్దులు, హరిదాసులు, బొమ్మల కొలువులు, వానభోజనాలు, పతంగుల పండుగ వంటి కార్యాక్రమాలు సందడిగా ఉంటాయి.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ మూడురోజులు భోగి (Pongal), సంక్రాంతి, కనుమ పేర్లతో జరుపుకుంటారు.
కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఆనందంగా వేడుకల్లో పాల్గొంటారు. ఈ పండుగ మన సాంప్రదాయాల విశిష్టతను ప్రతిబింబిస్తుంది.
The2States.com పాఠకులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మ్మమ్మల్ని ఇలానే ఆదరిస్తారని ఆశిస్తున్నాము.