fbpx
Saturday, October 19, 2024
HomeMovie Newsది రాజా సాబ్.. ఓ క్లారిటీ ఇచ్చిన నిర్మాత

ది రాజా సాబ్.. ఓ క్లారిటీ ఇచ్చిన నిర్మాత

MAKERS-CLARITY-ON-THE-RAJA-SAAB
MAKERS-CLARITY-ON-THE-RAJA-SAAB

మూవీడెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన రొమాంటిక్ క‌మ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా ది రాజా సాబ్ తో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.

మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తవ్వనుంది.

తాజా సమాచారం ప్రకారం, నవంబర్ 2024 నాటికి ఈ సినిమా పూర్తి అవుతుందని, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ వెల్లడించారు.

ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కానీ, ఈ సారి ఆయనను రొమాంటిక్ జానర్‌లో చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ది రాజా సాబ్ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తున్నారు. ప్రభాస్‌తో ఆమె కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంచనా.

మారుతి, తన ట్రేడ్‌మార్క్ కామెడీ, వినోదం, రొమాన్స్‌ను ఈ సినిమాలో మిళితం చేసినట్లు టాక్. కథలో హారర్ కామెడీ యాంగిల్ కూడా ఉండటం మరో విశేషం.

ది రాజా సాబ్ పూర్తి అవ్వడానికి ఇంకా కొద్దిపాటి షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది.

ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ విడుదలకు సిద్ధమవుతుండటంతో, అభిమానులు ఫుల్ హైప్‌లో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular