మూవీడెస్క్: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ RC 16 పై భారీ అంచనాలు ఉన్నాయి.
వృద్ధి సినిమాస్ బ్యానర్ పై కిలారు వెంకట సతీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుకుమార్ రైటింగ్స్ కూడా భాగమైంది.
ఉత్తరాంధ్ర నేపథ్యంలో పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది.
ఇప్పటికే ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు, దివ్యేందు వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
తాజాగా, ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్‌ను (KAJOL) నెగిటివ్ షేడ్ పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు టాక్.
ఒకవేళ ఆమె అంగీకరిస్తే, ఇది కాజోల్ తెలుగు సినిమాల్లో తొలి ఎంట్రీ అవుతుంది.
కాజోల్ గతంలో ధనుష్‌తో VIP 2 చిత్రంలో నెగిటివ్ రోల్ పోషించి ప్రశంసలు అందుకుంది. అయితే, ఇప్పటి వరకు ఆమె తెలుగు చిత్రాల్లో కనిపించలేదు.
కాజోల్ ఈ సినిమాలో భాగమైతే, హిందీ మార్కెట్‌పై RC 16 మరింత ప్రభావం చూపిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
ఆమె నటనతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.
హిందీ, కన్నడ మార్కెట్‌లను టార్గెట్ చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
అయితే, మేకర్స్ అధికారికంగా కాజోల్ ఎంపికపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మరి ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది వేచి చూడాలి.