fbpx
Saturday, January 18, 2025
HomeMovie News`ఫ్యామిలీ మ్యాన్ 2`- ఎవరినీ కించపరచలేదు

`ఫ్యామిలీ మ్యాన్ 2`- ఎవరినీ కించపరచలేదు

MakersResponseOn FamilyMan Allegations

బాలీవుడ్: కరోనా కి ముందే ఓటీటీలపై ఇంకా అందరూ అంతగా దృష్టి పెట్టకముందే 2019 లో ఫ్యామిలీ మాన్ అనే వెబ్ సిరీస్ రూపొంది సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సిరీస్ లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మనోజ్ బాజపాయ్ నటన సూపర్ అని చెప్పవచ్చు. థ్రిల్లింగ్ స్టోరీ , నరేషన్ తో ఈ సిరీస్ ఆకట్టుకుంది. 10 ఎపిసోడ్ లు ఉన్న మొదటి భాగం హిట్ అయిన తర్వాత దీనికి రెండవ భాగాన్ని రూపొందించారు మేకర్స్. ఈ సెకండ్ సీజన్ కి సంబందించిన ట్రైలర్ ని ఈ మధ్యనే విడుదల చేసారు. అయితే ట్రైలర్ ని చూసిన కొందరు ఈ సినిమాలో తమిళుల్ని కించ పరిచారని , టెర్రరిస్ట్ లుగా చూపించారని ఈ సిరీస్ ని బాన్ చేయాలనీ మంత్రిత్వ శాఖకు లేఖ కూడా రాశారు.

దీనిపై తెలుగు వారైనా ఈ సినిమా మేకర్స్ రాజ్ నిడిమోరు అండ్ డి.కే.కృష్ణ ఒక ప్రకటన విడుదల చేసారు. ఈ సిరీస్ లో ఎవర్నీ కించపరచలేదని, ఈ సినిమా రచనలో చాల మంది తమిళులు ఉన్నారని, తమ సినిమాకి పని చేసిన వాళ్లలో చాల మంది తమిళులు ఉన్నారని, తమిళుల్ని కించపరిచే అంశాలు ఈ సిరీస్ లో ఏమీ లేవని తెలియచేసారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సిరీస్ చూసాక మీరందరు మెచ్చుకుంటారు అని కూడా తెలిపారు. ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ లో సమంత నటిస్తుంది. ట్రైలర్ లో కూడా సమంత పాత్ర హైలైట్ అయిన విషయం కనిపిస్తుంది. జూన్ 4 నుండి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులో ఉండబోతున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular