కోలీవుడ్: టెక్నికల్ గా మాట్లాడుకుంటే ఒక సినిమా అంటే దర్శకుడి ఆలోచనల్లో ఆ కథ కి బీజం పడినప్పటి నుండి ఆ కథ సినిమా గా మారి షూటింగ్ పూర్తి చేసి దాన్ని విడుదల చేసే వరకు దాని ప్రయాణం ఉంటుంది. ఒక్కో సినిమాకి ఈ ప్రయాణం ఒక్కోలా ఉంటుంది. రీమేక్ సినిమాలకి ఒకలా, యదార్థ కథలకి ఒకలాగా, ఒక ప్రాంతానికి సంబందించిన సినిమా ఐతే ఒక లాగ.. ఇలా ఒక్కో రకమైన సినిమాకి ఒక్కో ప్రయాణం ఉంటుంది. కొన్ని సార్లు బయో పిక్ లకి ఆ సినిమా రూపొందించే పాత్రకి సంబందించిన ప్రయాణం వివిధ ప్రాంతాలని, వివిధ స్టేజి లు దాటుకొని వచ్చినట్టు ఉంటుంది. అవన్నీ డైరెక్టర్ స్టడీ చేసి వాటి గురించి తెలుసుకొని దానికి అనుగుణంగా పాత్రలు, సన్నివేశాలు రాసుకొని తీయాల్సి ఉంటుంది. అలాంటి ఒక ప్రయాణాన్ని సూర్య హీరో గా నటిస్తున్న ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా డైరెక్టర్ సుధా కొంగర ఒక వీడియో ద్వారా విడుదల చేసారు.
ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు ‘గోపినాథ్’ కథ ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమాకి బీజం ఎలా పడింది అని డైరెక్టర్ ఈ వీడియో లో తెలిపారు. పదేళ్లకి ముందు కెప్టెన్ గోపినాథ్ ఇంటర్వ్యూ మరియు ఆయన పై వచ్చిన బుక్ చదివి స్ఫూర్తి పొంది ఈ కథ మీద రీసర్చ్ చేశాను, అలా ఈ కథ మీ ముందుకు వచ్చింది అని చెప్పింది. ఆలా కథని ఒక 40 పేజీలు రాసి సూర్య గారికి ఇవ్వడం జరిగిందని, ఈ కథ తనకి నచ్చుతాదో నచ్చదో అనుకున్నా కానీ ఆయన చాలా బాగా నచ్చింది అనడం తో ఈ కథ ముందుకు వెళ్ళింది అని చెప్పారు. సూర్య మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ కి ముందే స్టోరీ డిస్కషన్ సెషన్ జరిగింది, నా ఇంతకముందు సినిమాలకి ఎపుడూ ఇలా జరగలేదు, ఇదే మొదటిటి. కానీ ఈ సెషన్ వల్ల షూటింగ్ చాలా తక్కువ రోజుల్లో పూర్తి చేయగలిగాము అని సూర్య తన అనుభవాలు చెప్పారు. అంతే కాకుండా ఈ సినిమాలో సూర్య ఈ గెటప్ కోసం ఎలా కష్టపడ్డాడు అని కూడా చూపించారు.