కోలీవుడ్: రజినీకాంత్ నటించిన ‘పేట’ సినిమాలో ఒక పాత్రలో మెరిసిన హీరోయిన్ ‘మాళవిక మోహనన్‘. కానీ ఎవరూ ఊహించనిది తమిళ్ లో తన రెండవ సినిమాకే ఇళయ దళపతి ‘విజయ్’ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా విడుదల అయ్యే సమయానికి కరోనా సంక్షోభం వచ్చి విడుదల ప్రస్తుతానికి వాయిదా పడింది. కార్తీ తో ‘ఖైదీ’ తీసి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘మాస్టర్’ సినిమాలో ఈ హీరోయిన్ విజయ్ సరసన నటించింది.
అయితే ఒకేసారి ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ లో విషెస్ చెప్తూ ధనుష్ తో కలిసి నటించాలని కోరిక ఉందని పబ్లిక్ గానే ట్వీట్ చేసింది. అయితే ఇపుడు తన చేతికి ఆ ఆఫర్ వచ్చేసింది. ఇలా కూడా ఆఫర్లు కొట్టెయ్యొచ్చు అని కొంత మంది హీరోయిన్లు ఇపుడు తెలుసుకుంటున్నారు. ధనుష్ తన 43 వ సినిమాలో హీరోయిన్ గా మాళవిక ని ఎంచుకున్నారు. తమిళ్ లో ‘D16 ‘ అనే చిన్న సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు కార్తీక్ నరేన్.. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించబోతున్నారు.