కోల్‌కతా: దేశం మొత్తం కరోనా కేసులతో ఒక పక్క అతలాకుతమవుతూనే ఉంది. అంతే ప్రాచుర్యం సాధించిన 5 రాష్ట్రాల ఎన్నికల కఊంటింగ్ కూడా ముగిసింది. అన్నింటికంటే అధిక హాట్ టాపిక్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు. ఇది ఒక పెద్ద సమరం లాగే కొనసాగింది.
ఈ ఎన్నికలలో టీఎంసీ తిరిగి విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో ఓడిపోయినప్పటికి తానే రాష్ట్ర ముఖ్యమంత్రినని ప్రకటించారు. ఆమె ప్రమాణ స్వీకారోత్సవానికి ముహుర్తం కూడా ఫిక్స్ చేసారు. మే నెల 5వ తేదీన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు దీదీ ప్రకటించారు.
ఈ రోజు రాత్రి ఏడు గంటలకు గవర్నర్‌ను కలవబోతున్నారు. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 292 నియోజక వర్గాలకు ఎన్నికలు నిర్వహించగా, ఏకంగా దీదీ పార్టీ 213 సీట్లను కైవసం చేసుకుంది. 77 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది.