fbpx
Sunday, November 24, 2024
HomeNationalప్రాణాలు తీసిన వర్క్ ఫ్రం హోం పని ఒత్తిడి

ప్రాణాలు తీసిన వర్క్ ఫ్రం హోం పని ఒత్తిడి

MAN-COMMIT-SUICIDE-WORK-FROM-HOME-PRESSURE

గాంధీనగర్‌ : కరోనా మహమ్మారి ప్రబలడం మొదలైన తరువాత ప్రజల క్షేమం కోసం దాదాపు అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ అవకాశాన్ని ఇచ్చాయి. ఈ తరుణంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఒత్తిడికి ఓ నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన మంగళవారం గుజరాత్‌ రాష్ట్రంలో చోటుచేసకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, గుజరాత్‌లోని అదాజన్‌కు చెందిన జిగర్‌ గాంధీ అనే వ్యక్తి నోయిడాలోని ఓ కంపెనీలో గత మూడు సంవత్సరాలుగా పని చేస్తున్నాడు.

దాదాపు రెండు నెలల నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ద్వారా విధులు నిర్వహిస్తున్నాడు. పని ఒత్తిడి కారణంగా కొద్దిరోజులుగా ముభావంగా ఉంటున్నాడు. ఈ ఒత్తిడి గురించి కుటుంబసభ్యులతో కూడా చర్చించాడు. అయినా అతడిలో మార్పురాలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సంఘటనపై అదాజన్‌ పోలీసు అధికారి మాట్లాడుతూ, గత డిసెంబర్‌లో అతడి ఎంగేజ్‌మెంట్‌ రద్దయింది. ఇక అప్పటినుంచి డిప్రెషన్‌లో ఉన్నాడు. దానికి తోడు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఒత్తిడి కూడా మొదలైంది. అతడికి సన్నిహితంగా ఉండే ఇద్దరు వ్యక్తుల్ని ఆత్మహత్యకు ముందు రోజు ఇంటికి పిలిపించుకుని ఆ రాత్రంతా వారితో సరదాగా గడుపుదామనుకున్నాడు. కానీ, అలా జరగలేదు. అంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular