ట్విట్టర్: ‘మనసా నమః’ అని అంటే పెద్దగా గుర్తుపట్టక పోవచ్చు కాని ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్ లో ఈ వీడియో కి వస్తున్న ఆదరణ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఈ సినిమా తాలూకు టెక్నిషియన్స్ ఎవరా అని చూసే అభిమానులు చాలా మంది ఉన్నారు. సినిమా మేకింగ్ ఒక కొత్త తరహా లో ఎలా చెయ్యొచ్చు, టెక్నిషియన్స్ ఒక కొత్త తరహాలో ఎలా ఆలోచించి ఒక కొత్త రకమైన ప్రోడక్ట్ (సినిమా కావచ్చు పాట కావచ్చు) ఎలా మార్కెట్ లోకి తీసుక రావాలో ఈ పాటని చూపించి ఒక ఉదాహరణ గా చెప్పొచ్చు. ఈ పాట , ఈ వీడియో అంతలా అలరిస్తుంది వీక్షకులని అని చెప్పుకోవచ్చు. 3 వారల క్రితం విడుదలైన ఈ వీడియో రీచ్ అయిన వాళ్ళ అందరి నుండి ప్రశంసలు అందుకుంటుంది. ఏ వీడియో కి అయిన కూడా ముఖ్యం గా అందులో నటించిన తారలకు గుర్తింపు ఎక్కువ వస్తుంది కాని ఈ షార్ట్ ఫిలిం వీడియోకి మాత్రం ఈ ప్రోడక్ట్ కి పని చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభించింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ ‘ఒండ్రాగా ఎంటర్టైన్మెంట్స్ ‘ పై సమర్పించిన ఈ వీడియో తక్కువ వ్యవధిలోనే మంచి గుర్తింపు పొందింది.
ఇంటర్నేషనల్ సౌండ్ అండ్ ఫిలిం మ్యూజిక్ ఫెస్టివల్ అని ప్రతి సంవత్సరం ఒక ఈవెంట్ లాగ జరుగుతుంది. అందులో భాగంగా సినిమాలతో పాటు ప్రపంచంలో ఉన్న షార్ట్ ఫిలిం నామినేషన్స్ ని కూడా యాక్సప్ట్ చేస్తారు. అందులోంచి కొన్ని సెలెక్ట్ చేసి ఈ ఈవెంట్ లో స్క్రీనింగ్ వేస్తారు. ఆలా ఈ సంవత్సరం జులై 26 , 27 ని జరగబోయే ఈ ఈవెంట్ లో ఈ ‘మనసా నమః’ అనే షార్ట్ ఫిలిం కూడా ప్రపంచవ్యాప్తంగా పంపించిన వీడియోస్ నుండి సెలెక్ట్ చేసి స్క్రీనింగ్ చేసే చివరి 15 వీడియోల్లో స్తానం సంపాదించింది. ఈ సంవత్సరం ఈ ఈవెంట్ ని ‘పుల అంఫై థియేటర్’ అంటే గ్లాడియేటర్ షూటింగ్ మొత్తం జరిగిన ప్రదేశం లో ప్రదర్శించబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ చిన్న సినిమాకి లభించిన పెద్ద గుర్తింపు అనుకోవాలి. ఇలా కొత్తగా ఏదైనా ప్రయత్నించే వారికి ఈ విజయం ఒక ఆశా జనకం అని చెప్పుకోవచ్చు.