టాలీవుడ్: ఈరోజుల్లో సినిమాతో డైరెక్టర్ గా జర్నీ ప్రారంభించి యూత్ ఫుల్ అడల్ట్ సినిమాలు తీసి భలే భలే మగాడివోయ్ సినిమాతో మీడియం రేంజ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు మారుతి. తర్వాత మహానుభావుడు, ప్రతిరోజు పండగే లాంటి సినిమాల ద్వారా హిట్ లు సాధించాడు. ఎదో ఒక లోపాన్ని వాడుకుని కామెడీ జెనెరేట్ చేయడం, ఫామిలీ ఎమోషన్స్, ఫామిలీ మెంబెర్స్ తో కామెడీ లాంటి ఎలిమెంట్స్ మారుతీ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుతం అదే కాన్సెప్ట్ తో మరో సినిమా రానున్నట్టు తెలుస్తుంది. ‘ఏక్ మినీ కథ‘ తో ఓటీటీ ల్లో డీసెంట్ హిట్ కొట్టిన సంతోష్ శోభన్ హీరోగా యూవీ కాన్సెప్ట్ బ్యానర్ లో మారుతీ ‘మంచి రోజులు వచ్చాయి’ అనే సినిమా రూపొందిస్తున్న విషయం తెల్సిందే. ఈ రోజు ఈ సినిమాలోని పాత్రల పరిచయం అంటూ ఒక వీడియో విడుదల చేసారు.
కొలీగ్ సంతోష్ అని హీరోని, పద్దు అని మెహ్రీన్ తో పాటు సినిమాలో ఉన్న మిగతా నటీనటుల్ని పరిచయం చేసారు ఈ వీడియో లో. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి, సప్త గిరి, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, సుదర్శన్ ఇలా ఇండస్ట్రీ లో యంగ్ కమెడియన్స్ అందర్నీ ఈ సినిమాలో దించేసాడు మారుతి. మారుతీ స్టైల్ అఫ్ కామెడీ ఈ సినిమాలో మరోసారి చూపించనున్నట్టు అర్ధం అవుతుంది. కరోనా పరిస్థితులని వాడుకుని కామెడీ జెనెరేట్ చేసినట్టు అర్ధం అవుతుంది. అనూప్ రూబెన్స్ సంగీతం లో ఈ సినిమా రూపొందుతుంది. UV కాన్సెప్ట్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ సంస్థలు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థియేటర్ లు తెరుచుకున్న తర్వాత హెల్తీ వాతావరణంలో ఈ సినిమాని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.